Medak: మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి
Medak: సింగూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పెరిగిన వరద
Medak: మెదక్ జిల్లా ఏడుపాయలలో వరద ఉధృతి
Medak: మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అమ్మవారి ఆలయ ప్రాగణంతోపాటు ఆలయం లోపలి నుండి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రాజగోపురంలోని అమ్మవారికి పూజలు మాత్రం నిర్వహిస్తున్నారు. ఆలయ పరిసరాల్లోకి ఎవరు రాకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వనదుర్గా ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్‌లోని పలు కాలనీలు జలమయమయ్యాయి.