Nirmal: వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం.. రూ.40 లక్షల ఆస్తి నష్టం
Nirmal: విద్యుత్ షార్ట షార్ట్ సర్క్యూట్ కారణం
Nirmal: వివాహ వేడుకలో అగ్ని ప్రమాదం.. రూ.40 లక్షల ఆస్తి నష్టం
Nirmal: నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించేది గ్రామ సమీపంలో ని సూర్య గార్డెన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్రిప్రమాదం సంభవించింది. ఒకవైపు వివాహం జరుగుతుండగా వంటశాలలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫంక్షన్ హాల్ కు చేరుకొని మంటలను ఆర్పారు.. ఈ ప్రమాదంలో సుమారు 30 నుంచి 40 లక్షల వరకూ ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక శాఖ అధికారి పేర్కొన్నారు. ఒకవైపు వివాహం జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు.