Fire Accident: పాల్వంచ సబ్ స్టేషన్ లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది.
Fire Accident Electric Substation in Palvancha:(File Image)
Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పట్టణ పరిధిలోని సీతారాంపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా చెలగేగుతుండటంతో విద్యుత్ సిబ్బంది విద్యుత్‌ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సబ్ స్టేషన్ అగ్ని ప్రమాదం సంభవించడంతో చుట్టుపక్కల మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విద్యుత్ కండక్టర్ వైరు తెగి ట్రాన్స్ ఫార్మర్లు మీదపడటంతో భారీగా మంటలు చెలరేగినట్లు ప్రమాధమిక సమాచారం. పాల్వంచ కేటీపీఎస్ నుంచి 3 కొత్తగూడెం నుంచి 1 ఫైర్ ఇంజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు కూడా వ్యాపించడంతో అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది.
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఆరుగురు సిబ్బంది సబ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రాణనష్టం సంభవించక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం జరగడంతో భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు అధికారులు.