Voter List: తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

Voter List: 2023 జనవరి వరకు ఓటర్ల తుది జాబితా విడుదలైంది.

Update: 2023-01-05 13:45 GMT

Voter List: తెలంగాణ ఓటర్ల తుది జాబితా విడుదల

Voter List: 2023 జనవరి వరకు ఓటర్ల తుది జాబితా విడుదలైంది. దాని ప్రకారం తెలంగాణలో 2 కోట్ల 99 లక్షల 92 వేల 941 ఓటర్లు ఉన్నట్లు తేలింది. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు వారు 2 లక్షల 78 వేల 650 మంది ఉండగా... ట్రాన్స్ జెండర్స్ 19 వందల 51 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు కోటి 49 లక్షల 24 వేల 718 ఉండగా.. పురుష ఓటర్లు కోటి 50 లక్షల 48 వేల 250 మంది ఉన్నారు. ఇక NRI ఓట్ల విషయానికి వస్తే... 2 వేల 740 మంది ఓటర్లు ఉండగా... సర్వీస్‌ ఓటర్లు 17 వేల 882 మంది ఉన్నట్లు గుర్తించారు. 2022 జనవరి ఓటర్ల జాబితా ప్రకారం 3 కోట్ల 3 లక్షల 56 వేల 894 మంది ఓటర్లు ఉన్నారు. జాబితాలోంచి 3 లక్షల 63 వేల 953 మంది ఓటర్లను తొలగించారు.

Tags:    

Similar News