వరి సాగు చేసిన రైతులకు ఆరంభంలోనే కష్టాలు

వరి నాట్లు వేసిన రైతులను నిండా ముంచిన వింత రోగం

Update: 2022-03-01 09:57 GMT

వరి సాగు చేసిన రైతులకు ఆరంభంలోనే కష్టాలు

Warangal: రాష్ట్ర ప్రభుత్వం వద్దని చెప్పినా వరి సాగు చేసిన రైతులకు ఆరంభంలోనే కష్టాలు తప్పడం లేదు. ముందస్తుగా వరి నాట్లు వేసిన రైతులను నిండా ముంచుతుంది ఓ వింత రోగం. మొగిలి పురుగు దీనికి తోడై వరి మొక్కలను తినేస్తుంది. వింత రోగంతో తీవ్ర నష్టాల్ని చవి చూస్తున్న వరంగల్ వరి రైతుల కష్టాలపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

వరంగల్ జిల్లాలో వింత తెగులుతో వరి రైతులు కష్టాలు పడుతున్నారు. వాతావరణం సహకరించకపోవడంతో పాటు మొగిలి పురుగులతో వరి ఎరుపు రంగులో మారుతుంది. దీంతో వరి పొలాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఈ వింత తెగులు ప్రభావంతో వరి సాగు వదిలేసామంటున్నారు రైతులు. కనీసం పెట్టుబడులైనా వస్తాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.

వ్యవసాయంతో రైతులు అప్పులపాలవడం తప్ప మరే లాభం లేదని వాపోతున్నారు వరంగల్ జిల్లా వరి రైతాంగం. కొత్త రోగాలకు ఎన్ని సార్లు మందులు కొట్టినా ఏమీ లాభం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి ఒకసారి మందు పిచికారి చేస్తే రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఐనా ఫలితం శూన్యమంటున్నారు.

వాతావరణానికి తోడు కొత్త తెగులు వరంగల్ జిల్లా వరి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వ్యవసాయంతో రైతులు అప్పులపాలవడం తప్ప మరో ప్రయోజనం లేదంటూ మండిపడుతున్నారు. 

Tags:    

Similar News