మీ పిల్లలను అమెరికా పంపించకండి... అమెరికాలో హత్యకు గురైన ప్రవీణ్ తండ్రి ఆవేదన

Update: 2025-03-06 14:56 GMT

అమెరికాలో తెలుగు విద్యార్థిని కాల్చిచంపిన దుండగులు... ప్రవీణ్ తండ్రి ఆవేదన 

Indian student Praveen Kumar Gampa shot dead in US: అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుకుంటున్న ప్రవీణ్ కుమార్ గంప అనే విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు బుధవారం కాల్చిచంపారు. ప్రవీణ్ కుమార్ 2023 ఆగస్టులో అమెరికా వెళ్లారు. ఎంఎస్ చదువుకుంటూ స్థానిక స్టోర్‌లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారు. బుధవారం స్టోర్‌లో దోపీడికి యత్నించే క్రమంలోనే గుర్తుతెలియని దుండగులు ఆయన్ను కాల్చిచంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలోని కేశంపేట గ్రామం.

బుధవారం ఉదయం ఎప్పటిలాగే ప్రవీణ్ తన తండ్రి రాఘవులుకు వాట్సాప్ కాల్ చేశారు. ఆ కాల్ చూసుకోని ఆయన ఆ తరువాత తిరిగి కాల్ చేస్తే ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఆ ఫోన్ ఎత్తారు. ఆ ఫోన్ తనకు దొరికిందని అవతలి వ్యక్తి చెప్పారు. అప్పుడే తన కొడుకు ఏదో సమస్యలో చిక్కుకున్నాడని భయమైందని... ఆ తరువాతే తమకు ఈ విషయం తెలిసిందని రాఘవులు తెలిపారు.

ప్రవీణ్ మృతదేహం బుల్లెట్ గాయాలతో కనిపించిందని కొంతమంది చెప్పారు. ఆయన్ను స్టోర్‌లో కాల్చిచంపారు అని ఇంకొంతమంది చెప్పారు. ఇందులో ఏది నిజమో స్పష్టత లేదని ప్రవీణ్ కజిన్ అరుణ్ పీటీఐకి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రవీణ్ హత్య ఉదంతంపై షికాగోలోని కాన్సూలేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్పందించింది. విస్కాన్సిన్ యూనివర్సిటీతో పాటు ప్రవీణ్ కుటుంబంతో తమ అధికారులు టచ్‌లో ఉన్నట్లు షికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. ప్రవీణ్ అకాల మరణంపై సంతాపం ప్రకటించిన ఇండియన్ ఎంబసీ... వారి కుటుంబానికి అవసరమైన సాయం చేస్తూ అండగా నిలుస్తున్నట్లు స్పష్టంచేసింది. 

మీ పిల్లలను అమెరికా పంపించకండి - రాఘవులు

ప్రవీణ్ మృతితో ఆ కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఏఎన్ఐతో రాఘవులు మాట్లాడుతూ... ప్రవీణ్ 2023 ఆగస్టులో అమెరికా వెళ్లినట్లు చెప్పారు. "చివరి డిసెంబర్‌లో ఇండియాకు వచ్చి జనవరిలో మళ్లీ వెళ్లారు. రూ. 11 లక్షల ఫీజు పెండింగ్ ఉంటే ఆ డబ్బంతా కట్టేశానని, ఇకపై తనకు ఇంటి నుండి ఏమీ పంపించాల్సిన అవసరం లేదని అన్నారు. అక్కడే తనకు లోన్ వస్తుందని కూడా చెప్పారు. బీటెక్ చేసిన తరువాత ఇక్కడే జాబ్ చేసిన ప్రవీణ్ ఆ తరువాత మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లారు. ఇంతలోనే ఇలా అవుతుందని అనుకోలేదు. అందుకే మీ పిల్లలను అమెరికా పంపించకండి" అని రాఘవులు కన్నీటి పర్యంతం అయ్యారు.

Also watch this video: Actress Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఏంటి ఈ హీరోయిన్ వెనకున్న పొలిటీషియన్ ఎవరు?

Full View

Also watch this video: Trump tariffs Impacts on India: ట్రంప్ టారిఫ్‌లతో ఇండియా బేజారు

Full View


Tags:    

Similar News