రైతు కళ్లల్లో ఆనందం.. రోజుకు రూ.లక్ష సంపాదిస్తున్న టమోటా రైతు
Tomato Rates: 3 రోజుల్లో రూ.3లక్షలు సంపాదించిన రైతు
రైతు కళ్లల్లో ఆనందం.. రోజుకు రూ.లక్ష సంపాదిస్తున్న టమోటా రైతు
Tomato Rates: గత వారం రోజుల నుంచి టమోటా ధరలు మండి పోతున్నాయి. టమోటా ధర కిలో వంద రూపాయలు దాటేసింది. రైతులకు మద్దతు ధర వచ్చినా వినియోగ దారులకు గుదిబండగా మారింది. కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన రైతు రాజయ్య మూడు ఎకరాల్లో టమోటా సాగు చేశాడు. మొదట్లో 22 కేజీల బాక్స్‌కు 200 రూపాయల మద్దతు ధర పాలికేది. ప్రస్తుతం ఒక్కరోజుకి 30 నుంచి 35 బాక్సులు అమ్ముతున్నాడు. ధరలు అమాంతం పెరిగిపోవడంతో రోజుకు లక్షరూపాయల చొప్పున మూడు రోజులకు మూడు లక్షల రూపాయలు వచ్చాయి.