Talasani Srinivas Yadav: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం
పీవీ ఘాట్‌లో నివాళులర్పించిన మంత్రులు మహమూద్ అలీ, తలసాని, మల్లారెడ్డి
Talasani Srinivas Yadav: మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం
Hyderabad: మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి నివాళులర్పించారు. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిలోకి తెచ్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలన్నారు. ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన PVని గౌరవించకపోవడం విచారకరమన్నారు తలసాని. PV శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా తెలంగాణ ప్రభుత్వం వేడుకలు నిర్వహించిందన్నారు.