Mahesh murder case: మలుపులు తిరుగుతున్న ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ హత్యకేసు
Former MPTC Mahesh murder case: మూడురోజులుగా గడ్డం మహేష్ మొబైల్‌తో నిందితుల చాటింగ్
Mahesh murder case: మలుపులు తిరుగుతున్న ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ హత్యకేసు
Former MPTC Mahesh murder case: ఘట్‌కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ హత్య కేసులో మలుపులు తిరుగుతోంది. హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహేష్‌ను హత్య చేసిన అనంతరం అతడి ఫోన్ తోనే బంధువులతో వాట్సప్ చాటింగ్ చేశారు నిందితులు. మహేష్‌కు సురక్షితంగా ఉన్నట్టు అతని కుటుంబసభ్యులను నమ్మించే ప్రయత్నం చేశారు.
అయితే మృతుడు మహేష్ కనిపించలేదని పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని.. తమకు స్థానిక కౌన్సిలర్ మల్లేష్‌పై అనుమానాలు ఉన్నాయని బంధువులు చెబుతున్నారు. అసలు నిందితులు కాకుండా వేరే వ్యక్తులను నిందితులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తున్నారు.
అసలు నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి ఘర్షణ వాతావరణం నెలకొనకుండా.. మృతుడు మహేష్ ఇంటితో పాటు, నిందితుల నివాసాల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు.