Boora Narsaiah Goud: బీజేపీలోకి రావటం ఘర్ వాపసీలా ఉందన్న బూర నర్సయ్య
*బైపోల్స్‌లో సీఎంను గ్రామ ఇన్‌చార్జ్‌గా చేసిన ఘనత బీజేపీదేనన్న బండి సంజయ్
Boora Narsaiah Goud: బీజేపీలోకి రావటం ఘర్ వాపసీలా ఉందన్న బూర నర్సయ్య
Boora Narsaiah Goud: నర్సయ్య గౌడ్ రాకతో మునుగోడులో బీజేపీ బలం పెరిగిందని తెలిపారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన బూర నర్సయ్య లాంటి నేతలు కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదన్నారు. ఈనెల 19న అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ అనే బీజేపీ నినాదం నచ్చి పార్టీలో చేరుతున్నానన్నారు. ఉద్యమకారులున్న బీజేపీలోకి రావటం.. ఘర్ వాపసీ మాదిరిగా ఉందన్నారు.