Harish Rao: దోమల నివారణకు అందరూ కృషి చేయాలి

Harish Rao: ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపు

Update: 2023-07-23 07:27 GMT

Harish Rao: దోమల నివారణకు అందరూ కృషి చేయాలి

Harish Rao: ప్రతి ఒక్కరూ ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలను, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందామని పిలుపునిచ్చారు మంత్రి హరీశ్ రావు. GHMC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆదివారం ఉదయం 10 గంటలకు10 నిమిషాలు దోమల నివారణ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కోకాపేట్ లోని తన నివాసంలో 10 నిమిషాలు ఇంటి పరిసరాలలో నిల్వ ఉండే నీటిని స్వయంగా తొలగించి చెత్తను శుభ్రం చేశారు. వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని.. వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల నివారణకు అందరూ కృషి చేయాలని మంత్రి సూచించారు. ప్రికాషన్ ఈజ్ బెటర్ దన్ క్యూర్ అని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు.

Tags:    

Similar News