Revanth Reddy: హైడ్రాపై ఒత్తిడి ఉన్నా.. వెనక్కి తగ్గేదే లే
Revanth Reddy: చెరువులను రక్షించాలన్న ఏకైక లక్ష్యంతోనే పనిచేస్తున్నాం
Revanth Reddy: హైడ్రాపై ఒత్తిడి ఉన్నా.. వెనక్కి తగ్గేదే లే
Revanth Reddy: చెరువులను చెరబట్టిన వాళ్లనుంచి.. వాటిని రక్షించాలన్న ఏకైక లక్ష్యంతోనే హైడ్రా పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోకాపేటలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకులకు సీఎం హాజరయ్యారు. హైడ్రాను భగవద్గీత నుంచి స్పూర్తిగా తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా భగద్గీత గీత సందేశాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ధర్మం గెలవాలంటే.. అధర్మం ఓడాల్సిందేనని.. భగద్గీతలోని సారాంశాన్ని రేవంత్ రెడ్డి బోధించారు. చెరువులును కబ్జా చేసుకుని విలాసవంతమైన భవనాలు కట్టుకున్న పెద్దమనుషులు చాలా మంది ఉన్నారన్నారు. వారు ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ.. ప్రభుత్వాన్ని ప్రభావం చేసేవాళ్లేనని.. కానీ.. అలాంటి వాటిని తాను పట్టించుకోదల్చుకోలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.