లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రంలో కేసులు పెరిగాయి

తెలంగాణ రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.

Update: 2020-06-05 14:55 GMT
Etela Rajendar(File photo)

తెలంగాణ రాష్ట్రంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు.రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్నవారికి, వృద్ధులకు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న హైరిస్క్ వ్యక్తులకే కరోనా పరీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. అయితే, కొన్ని రాజకీయ పక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని, కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యను ఎవరూ రాజకీయ కోణంలో చూడరాదని, ఇది ప్రపంచం మొత్తం ఉన్న సమస్య అని స్పష్టం చేశారు.

కేంద్రం ప్రకటించిన అన్ని లాక్ డౌన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని, ఐసీఎంఆర్ నియమావళిని అనుసరిస్తున్నామని మంత్రి ఈటల రాజేంద్ర చెప్పారు. ప్రభుత్వం ఎంత చేస్తున్నాగానీ, కొందరు కోర్టుల్లో పిటిషన్లు వేయడం వంటి రకరకాల పద్ధతుల్లో ప్రభుత్వాన్ని అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. ప్రజల పట్ల ప్రేమ ఉంటే సరైన సూచనలు చేయాలని ప్రతిపక్షాలకు సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏవైనా సూచనలు, సలహాలు ఇచ్చి ప్రభుత్వానికి సహకరించాలే తప్ప, దుష్ట చర్యలు చేయరాదని హితవు పలికారు.

లాక్ డౌన్ సడలింపులతో రాష్ట్రంలో ఎక్కువ కేసులు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మంత్రి ఈటల వెల్లడించారు. కరోనా రోగులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని అన్నారు. 

Tags:    

Similar News