కేసీఆర్ ఇంట్లో కూర్చొని ప్లాన్ చేస్తే అమలు చేసేవారిలో నేను ఒకడిని- ఈటల
* తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడ్డానో ప్రజలకు తెలుసు * తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువ సార్లు జైలుకు వెళ్లింది కూడా నేనే
ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
Etela Rajender: తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడ్డానో ప్రజలకు తెలుసని అన్నారు బీజేపీ నేత, మాజీమంత్రి ఈటల రాజేందర్. కేసీఆర్ ఇంట్లో కూర్చొని ప్లాన్ చేస్తే వాటిని అమలు చేసిన వాళ్లల్లో తాను ఒకడినని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కువ సార్లు జైలుకు వెళ్లిన వ్యక్తి కూడా తానేనని అన్నారు ఈటల. గొల్లకుర్మలపై సీఎం కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే రాష్ట్రమంతా గొర్రెల పంపిణీ చేపట్టాలని అన్నారు. అలాగే రాష్ట్రంలోని దళితులందరికీ దళితబంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈటల.