Muthyalamma Temple Vandalism: ఈటల రాజేందర్ హౌజ్ అరెస్టు
Eatala Rajendar: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి.
Muthyalamma Temple Vandal: ఈటల రాజేందర్‌ను హౌజ్ అరెస్టు
Eatala Rajendar: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు.
బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.