Etela Rajender: సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన ఈటల..

Etela Rajender: పిచ్చోడి చేతిలో రాయి ఉందని ప్రజలు భావిస్తున్నారు.

Update: 2023-06-02 09:30 GMT

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన ఈటల..

Etela Rajender: సీఎం కేసీఆర్‌పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా తన క్యాంపు ఆఫీసులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పిచ్చోడి చేతిలో రాయి ఉందని భావిస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే నిధులు, నియామకాలు, వస్తాయని తెలంగాణ సమాజం ఆశ పడిందని, కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల హక్కులు హరించుకుపోయాయని ఆరోపించారాయన... తెలంగాణలో వరి పండించిన రైతులు దోపిడీకి గురవుతున్నారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలందరూ ఏకమై కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈటల కోరారు.

Tags:    

Similar News