Errabelli Dayakar Rao: రాహుల్‌గాంధీకి పట్టిన గతే వీరికి పడుతుంది..!
Errabelli Dayakar Rao: బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆదారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు.
Errabelli Dayakar Rao: రాహుల్‌గాంధీకి పట్టిన గతే వీరికి పడుతుంది..!
Errabelli Dayakar Rao: బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆదారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. పేపర్ లీకేజ్ పై ఆరోపలు చేస్తున్న వీరిద్దరిని ఆధారాలుంటే చూపాలని సిట్ కోరిందన్నారు. ఆధారాలు లేకపోవడం వల్లే చూపించలేకపోయారన్నారు. ఆధారాలులేని ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీకి జైలు శిక్ష పడిందన్నారు. ఇలాంటి ఆరోపణలు చేసిన రేవంత్, బండి సంజయ్ లకు కూడా అదే గతి పడుతుందన్నారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని తెలిపారు. సరైన సమయంలో ప్రతిపక్షాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. ఎవరు దొంగలో ఎవరు దొరలో దర్యాప్తులో తేలుతుందన్నారు.