Harish Rao: ఏపీ కార్మికులు అక్కడ ఓటు రద్దు చేసుకోవాలన్న హరీశ్ రావు
Harish Rao: ఏపీ, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుంది?
Harish Rao: ఏపీ కార్మికులు అక్కడ ఓటు రద్దు చేసుకోవాలన్న హరీశ్ రావు
Harish Rao: మంత్రి హరీశ్‌రావు మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నుంచి వలస వచ్చిన కార్మికులు అక్కడ ఓటు రద్దు చేసుకొని తెలంగాణలో ఓటుకు అప్లై చేసుకోవాలని సూచించారు. ఆంధ్రా, తెలంగాణలో పాలన చూస్తున్నారు కదా.. ఏది బాగుంది? అంటూ కార్మికులను ప్రశ్నించారు.
తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే సీఎం కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు తెలిపారు. సంగారెడ్డిలోని 9వ వార్డులో 20 లక్షలతో కార్మికుల భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేసిన సందర్భంగా హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రోడ్లు, ఆస్పత్రులు తెలంగాణలో రోడ్లు ఆస్పత్రులు ఎలా ఉన్నాయంటూ హరీశ్ రావు కార్మికులను అడిగారు. మేడే రోజున సీఎం కేసీఆర్ నోట కార్మికులు శుభవార్త వింటారని తెలిపారు. జిల్లాలో 2 కోట్లతో 2 ఎకరాల్లో కార్మికుల భవన నిర్మాణం చేపట్టబోతున్నామని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు.