వృత్తిపట్ల నిబద్ధత కలిగి ఉండాలి

బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహించే సిబ్బంది వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన, కలిగి ఉండాలని అడిషనల్ డిసిపి లా & ఆర్డర్ మురళీధర్ అన్నారు.

Update: 2019-12-06 04:01 GMT
డిసిపి మురళీధర్, ఐటి కోర్ టీమ్ సత్యనారాయణ

ఖమ్మం: బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహించే సిబ్బంది వృత్తిపట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సమయపాలన, కలిగి ఉండాలని అడిషనల్ డిసిపి లా & ఆర్డర్ మురళీధర్ అన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బ్లూ కోల్ట్స్ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది యొక్క విధివిధానాలుపై ఒకరోజు శిక్షణ తరగతులు స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హల్లో నిర్వహించారు.

కార్యక్రమానికి హజరైన అడిషనల్ డిసిపి మాట్లాడుతూ ... మెరుగైన సేవలు, భద్రతకు భరోసా కోసం పోలీస్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంచిన డయల్ 100 కాల్స్ కు సకాలంలో స్పందించి సమస్యలను పరిష్కారించల్సిన భాద్యతముందుగా సంఘటనలు జరిగిన సమీప ప్రాంతాలలో ఉన్న బ్లూ కోల్ట్స్, పెట్రోల్ కార్ సిబ్బందేనని అన్నారు. ఇలాంటి కీలకమైన భాద్యతలను నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే శాఖపరమైన చర్యలు తప్పవని అన్నారు. ప్రొయాక్టివ్ పోలీసింగ్ ద్వారా నేరాల అదుపులో ఉంచేందుకు దోహదపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఐటి కోర్ టీమ్ సత్యనారాయణ పాల్గొన్నారు.


Tags:    

Similar News