Sheikh Akbar: కాంగ్రెస్ వచ్చాక పేదలకు పక్కా గృహాలు కట్టిస్తాం
Sheikh Akbar: అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతాం
Sheikh Akbar: కాంగ్రెస్ వచ్చాక పేదలకు పక్కా గృహాలు కట్టిస్తాం
Sheikh Akbar: మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న పేదలకు కనీస సౌకర్యాలు లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారని మలక్ పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్ అన్నా రు. మూసానగర్ బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదలను కేవలం ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదలకు పక్కా గృహాలు కట్టించి తీరుతామని హామీ ఇచ్చారు.మలక్ పేటలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. తనకు ఒక సారి అవకాశం కల్పిస్తే మలక్ పేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా దిద్దుతానని తెలిపారు.