MLC Kavitha: రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హజరుపరుచనున్న ఈడీ
MLC Kavitha: కవితను మరో వారం పాటు కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం
MLC Kavitha: రేపు మధ్యాహ్నం కవితను కోర్టులో హజరుపరుచనున్న ఈడీ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ రేపటితో పూర్తికానుంది. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. మరో వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును అడిగే అవకాశం ఉంది. ఇప్పటికే 10 రోజుల పాటు రెండు విడతల్లో ఈడీ కస్టడీకి కోర్టు అంగీకరించింది. 10 రోజుల కవిత విచారణపై కోర్టుకు ఈడీ అధికారులు నివేదికను సమర్పించనున్నారు. ఈడీ ఫైల్ చేసే ఛార్జిషీట్‌లో విచారణ పూర్తి అయిందని తెలిపితే.... కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది.