ED Raids: తెలంగాణలో పలు చోట్ల ఈడీ సోదాలు

ED Raids: తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఈడీ రైడ్స్

Update: 2023-06-21 07:24 GMT

ED Raids: తెలంగాణలో పలు చోట్ల ఈడీ సోదాలు

ED Raids: హైదరాబాద్‌లో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం నుండి అధికారులు బృందాలుగా విడిపోయి కార్లలో వివిధ ప్రాంతాలకు వెళ్లారు. భారీగా సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి బయలుదేరారు. హైదరాబాద్‌తో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మేడ్చల్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ రీసెర్చ్ సెంటర్లలో ఈడీ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ బ్రాంచ్‌లు ఉన్నాయి. ఈ బ్రాంచులతో పాటు మరికొన్ని మెడికల్ కాలేజీల్లో ఈడీ దాడులు చేపడుతోంది. దాదాపు 6 జిల్లాలో ఈడీ తనిఖీలు జరుగుతున్నాయి. కాలేజీల్లోని నిధులు వ్యవహారాల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కీలక డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News