Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేశాం

Update: 2024-03-18 13:44 GMT

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అధికారిక ప్రకటన చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఈనెల 15న కవిత ఇంట్లో సోదాలు చేశామన్న ఈడీ.. కవిత బంధువులు సోదాలకు ఆటంకం కలిగించారని ఆరోపించింది. ఆప్ లీడర్లతో కలిసి లిక్కర్ పాలసీని లీక్ చేశారని.. ఈ క్రమంలోనే 100 కోట్లు ఆమ్ ఆద్మీపార్టీ నేతలకు చేర్చారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేసి...128.79 కోట్లు సీజ్ చేసినట్లు తెలిపింది ఈడీ..

మరోవైపు కవిత రెండవ రోజు ఈడీ విచారణ ముగిసింది. 100 కోట్ల వ్యవహారంతో పాటు పిళ్లై, నాయర్‌తో లావాదేవీలపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. అలాగే.. గతంలో సమాధానం చెప్పని ప్రశ్నలను మళ్లీ అడిగినట్లు సమాచారం. ఇక ఢిల్లీలోనే ఉన్న గులాబీ నేతలు..కేటీఆర్ హరీష్ కొద్ది సేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ములాఖత్‌లో కవితను కలవనున్నారు కేటీఆర్, హరీష్.. 

Tags:    

Similar News