తెలంగాణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

Telangana: రంగవల్లులతో ఆకట్టుకున్న విద్యార్థినులు కోలాటాలు, నృత్యాలతో అలరించిన విద్యార్థినులు

Update: 2024-01-04 14:22 GMT

తెలంగాణలో ముందస్తు సంక్రాంతి సంబరాలు

Telangana: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆల్ఫోర్స్ పాఠశాల విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలు ధరించి ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి, భోగి మంటలు వెలిగించి, ఆ మంటల చుట్టూ కోలాటాలతో విద్యార్థినులు నృత్యాలు చేశారు. బెల్లంతో పాయసం వండారు. గంగిరెద్దు విన్యాసాలతో, మన సంస్కృతీ సాంప్రదాయాలపై, పల్లెటూరి పాటలపై చిన్నారులు చేసిన నృత్యాలు అందర్నీ అలరించాయి.

పిల్లలకు మన సాంప్రదాయాలు నేర్పాలన్నదే తమ ఉద్దేశమని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. నేటి యువత మన సంస్కృతిని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారని, సంక్రాంతి పండుగకు ఆవు పేడ కూడా దొరకడం కష్టమైపోయిందన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను అందరూ కాపాడాలని కోరారు... మన సంస్కృతీ సాంప్రదాయాల గురించి నేటి విద్యా్ర్థులకు తెలియజేయాలన్నదే తమ ఉద్దేశమని, అందుకే తమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నరేందర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News