హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్

హైదరాబాద్ నగర వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు.

Update: 2020-01-27 06:38 GMT

హైదరాబాద్ నగర వాసులు నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారు. నగరానికి కృష్ణా జలాలను తరలిస్తున్న కృష్ణా ఫేజ్3 పైపులైన్‌కు భారీగా లీకేజీలు ఏర్పడ్డాయని జలమండలి అధికారులు తెలిపారు. ఇందుకు గాను బుధవారం నగరంలోని కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేసి పైప్ లైన్ మరమ్మత్తు పనులను చేపట్టనున్నట్లు అధికారులు స్ఫస్టం చేసారు.

ఇందులో భాగంగానే నగరంలోని సాహెబ్ నగర్, ఆటో నగర్, వైశాలి నగర్, మీర్ పేట్, జల్ పల్లి, మైలార్ దేవ్ పల్లి, శాస్త్రి పురం, బండ్లగూడ, ఆసిఫ్ నగర్, రెడ్ హిల్స్, షేక్ పేట్, ప్రశాసన్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, బుద్వేల్, సులేమాన్ నగర్, హైదర్‌గూడ, గోల్డెన్ హైట్స్, గంధంగూడ, అళ్లబండ, భోజగుట్ట, నార్సింగి, బోడుప్పల్, చెంగిచర్ల, ఫిర్జాదిగూడ, అల్వాల్, సైనిక్ పురి, లాలాపేట్, స్నేహపురికాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో 29వ తేదీ అంటే బుధవారం ఉదయం 6 గంటల నుంచి 30వ తేదీ గురువారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు నీటి సరఫరాను నిలిపివస్తున్నామని తెలిపారు. నగరవాసులు ఈ విషయాన్ని గమనించి వారికి సహకరించాలని జలమండలి అధికారులు ప్రజలను కోరారు.

ఇదే నేపథ్యంలో అక్రమ నల్లా కనెక్షన్లు తీసుకున్న వారు ఇప్పటికైనా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకూ నగరంలో చాలామంది జలమండలి అనుమతి లేకుండా నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్ ద్వారా అక్రమ నల్లా కనెక్షన్లను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. అందులో భాగంగానే వచ్చే నెల ఫిబ్రవరి 21లోగా అక్రమ నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్న వారు దరఖాస్తు చేసుకోవాలని లేక పోతే వారికి భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. 

Tags:    

Similar News