Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి..!
Hyderabad Road Accident: హైదరాబాద్ కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అతివేగంతో లారీ ఢీకొట్టింది.
Hyderabad Road Accident: నగరంలో రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మృతి..!
Hyderabad Road Accident: హైదరాబాద్ కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ని అతివేగంతో లారీ ఢీకొట్టింది. దీంతో డెలివరీ బాయ్ అంజిత్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లా పెద్ద షాపూర్ తాండ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా మహిళను బులెట్ బైక్ ఢీకొట్టింది. దీంతో ప్రమాదంలో దుర్గ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోవటంలేదని స్థానికులు తెలిపారు.