యజమానిని రక్షించబోయి.. ప్రాణాలు కోల్పోయిన శునకం!

Update: 2019-06-29 12:13 GMT

విశ్వాసానికి మారుపేరు శునకం యజమాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనే బలి పెడుతుంది. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో జరిగింది. అర్ధవీడు మండలం అయ్యవారిపల్లి చిలకనగర్‌‌కు చెందిన నలుగురు భైరవుని కొండ ప్రాంతానికి మేకలను మేపేందుకు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో మేకలన్నీ మేత కోసం పరుగులు తీశాయి. కాపర్లు మాటల్లో పడి వెనకబడి పోయారు.

అయితే ఇటీవల కురిసిన వర్షాలకు 11 కెవీ విద్యుత్ స్తంభం నేల కూలింది. ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. కరెంట్ ‌సరఫరా జరుగుతుండటంతో ఓ మేక కరెంటు తీగకు తగిలి చనిపోయింది. దీన్ని గమనించిన కుక్క మిగిలిన మేకలు అటువైపు రాకుండా అడ్డుకుంది. పెద్దగా అరిచి కాపర్లను అప్రమత్తం చేసింది. అక్కడి చేరుకున్న కాపర్లు మేక చనిపోయి ఉండటం గమనించారు. మిగతా మేకలు అటు వైపు రాకుండా అడ్డుకున్నారు. మేకలను తరిమే క్రమంలో శునకం కూడా విద్యుత్ షాక్‌కు గురై చనిపోయింది. కుక్క తమ వెంటే లేకపోయి ఉంటే తాము కూడా ప్రాణాలు కోల్పోయి ఉండేవారమని కాపర్లు వాపోయారు.

Full View  

Tags:    

Similar News