Andhra Pradesh: నడిరోడ్డు మీద కొట్టుకున్న పోలీసులు, వీడియో వైరల్..
Viral Video: పరస్పరం బాహాబాహీకి దిగిన పోలీసులు
Viral Video: డ్యూటీ షిఫ్ట్ ఆలస్యంపై గొడవ.. నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు
Viral Video: గొడవలను కంట్రోల్ చేసే పోలీసులే.. సహనం కోల్పోయి నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు. పిడిగుద్దులతో పరస్పరం దాడి చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్టులో శివ, నారాయణస్వామి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. సాయంత్రం డ్యూటీ షిఫ్ట్ ఆలస్యం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి.. పరసర్పం దాడులకు దిగారు.
పబ్లిక్‌గా ప్రజల ముందే బాహాబాహికీ దిగి కొట్టుకోవడంతో.. స్థానికులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఎస్సై రాజేష్ కుమార్‌ను వివరణ కోరగా క్షుణ్ణంగా పరిశీలించి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే.. పోలీసుల ముష్టియుద్దం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు నవ్వుకుంటున్నారు.