గుండాగిరి నడవదు..డీజీపీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

Update: 2019-10-12 13:30 GMT

ఆర్టీసీ సమ్మెపై ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు చర్చలు లేవని తేల్చి చెప్పారు. సమ్మెను ఉదృతం చేసినా, పిల్లిమొగ్గలు వేసినా ప్రభుత్వం చలించదన్నారు. బెదిరింపులకు ప్రభుత్వం భయపడదని సీఎం చెప్పారు. బస్సులు నడిపి, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందన్నారు. బస్సులను ఆపి, బస్టాండ్లు, బస్ డిపోల వద్ద అరాచకం చేద్దామని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో గుండాగిరి నడవదన్నారు సీఎం కేఆర్. ఇప్పటి వరకు ప్రభుత్వం, ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో కాస్త ఉదాసీనంగా ఉందన్నారు. ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. బస్ స్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరు బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కేసీఆర్ తెలిపారు.

డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్ ప్రతీ ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసులతో బందోబస్తును పెంచాలని ఆదేశించారు. అన్ని చోట్ల సిసి కెమెరాలు పెంచాలని మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని చెప్పారు. నిఘా పోలీసులనూ ఉపయోగించాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిని, బస్సులను ఆపేవారిని, ఇతర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని డీజీపీకి తెలిపారు. ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే, ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు కేసీఆర్.

Full View

Tags:    

Similar News