New Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ..లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే

New Ration Cards: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇస్తోంది. జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది.

Update: 2025-03-01 06:30 GMT

Ration Card

New Ration Cards In Telangana


New Ration Cards: తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఇస్తోంది. జనవరి 26న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. కానీ ఆ రోజు 16,900 కుటుంబాలకే కొత్త రేషన్ కార్డులను ఇచ్చింది. అది ఒక ట్రయల్ లాగా మాత్రమే ఇచ్చింది. పూర్తి స్థాయిలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు మార్చి 1వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసింది. నేడు మార్చి 1వ తేదీ కావడంతో కొత్త రేషన్ కార్డుల జారీ మొదలైనట్లు తెలిసింది. నేటి నుంచి లబ్దిదారుల ఇళ్లకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. లేదంటే ఆన్ లైన్ లో పొందవచ్చు.

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగే జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగని రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రమే కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత మిగతా జిల్లాల్లోనూ ఇస్తారు.

ఎవరైనా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోకపోతే..ఇప్పుడు కూడా చేసుకునే అవకాశం ఉంది. దీనికి గడువు తేదీ ఏమీ ఉండదు. నిరంతరం చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాలకు వెళితే అక్కడి ఉద్యోగులు ఈ పనిని పూర్తి చేసి పెడతారు. ఇందుకోసం రూ. 50 ఫీజుకు తీసుకుంటారు. పని పూర్తయ్యాక స్టేటస్ చూసుకునేందుకు ఒక రిఫరల్ నెంబర్ కూడా ఇస్తారు. హైదరాబాద్ లో 83వేల రేషన్ కార్డులకు ఆల్రేడి దరఖాస్తు చేసుకుకన్నారు.

నేడు మార్చి 1వ తేదీ రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోని 1.12 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారని తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 24,000, వికారాబాద్‌ జిల్లాలో 22,000, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 15,000, గద్వాల జిల్లాలో 13,000, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 13,000, నారాయణపేట జిల్లాలో 12,000, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 6,000, వనపర్తి జిల్లాలో 6,000, హైదరాబాద్‌‌లో 285 మందికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారని సమాచారం.

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం 5.12 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఇంకా కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో కొంతమంది ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకుని..మళ్లీ మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నారు. కొత్ రేషన్ కార్డుల ప్రక్రియను ఈ నెలలో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. 

Tags:    

Similar News