ఇవాళ GHMC పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
*8 ప్రాంతాల్లో 11,700 డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం
ఇవాళ GHMC పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
Double Bedroom Houses: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను ఇవాళ ప్రారంభించనుంది తెలంగాణ సర్కార్. నిర్మాణం పూర్తయిన ఇళ్లను అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో 11 వేల 700 మంది లబ్దిదారులకు డిగ్నిటీ డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేసే ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలోని తొమ్మిది లొకేషన్లలో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ఇళ్లను లాటరీ ద్వారా కేటాయిస్తారు. డ్రా ద్వారా ఎంపికైన లబ్ధిదారులను ప్రత్యేక బస్సుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఉన్న ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు.