Daanam Nagender: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డైలమాలో దానం నాగేందర్

Daanam Nagender: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైలమాలో పడ్డారు.

Update: 2025-11-21 09:10 GMT

Daanam Nagender: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డైలమాలో దానం నాగేందర్

Daanam Nagender: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్ మరోసారి వీరికి నోటీసులు జారీ చేశారు.

దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై అనుచరులతో దానం మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడితే పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందన్న భావనలో ఉన్నారు. రాజీనామా చేస్తే మళ్లీ పోటీ చేయవచ్చన్న అలోచనకు వచ్చారు.

Tags:    

Similar News