Dharmapuri: ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ కేసు విచారణ
Dharmapuri: ఇవాళ జగిత్యాల JNTU ప్రాంగణంలో జరగనున్న విచారణ
Dharmapuri: ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ కేసు విచారణ
Dharmapuri: జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ తాళాల మిస్సింగ్ కేసుపై ఇవాళ ఎన్నికల సంఘం విచారణ చేపట్టనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపనున్నారు. జగిత్యాల JNTU ప్రాంగణంలో విచారణ జరగనుంది. జిల్లా ఎన్నికల అధికారితో పాటు నాటి ధర్మపురి అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. 2018లో జరిగిన ధర్మపురి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హై కోర్టను ఆశ్రయించారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూంలో ఉంచిన పోలింగ్, కౌంటింగ్ ఫామ్స్ కు సంబంధించిన వివరాలను కోర్టులో సమర్పించాలని హై కోర్టు ఎన్నికల అధికారి బిక్షపతిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో హై కోర్టు ఆదేశాలు అందించారు.
ఈ నెల 10న జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ యాస్మిన్ భాషా సమక్షంలో ధర్మపురి కౌంటింగ్ స్ట్రాంగ్ రూం ఓపెన్ చేయాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఇందులో రెండు తాళం చేతులు పోయాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించగా, కలెక్టర్ యాస్మిన్ భాషా మాత్రం తాళలు ఓపెన్ కావడం లేదని చెప్పుకొచ్చారు. అయితే లక్ష్మణ్ కుమార్ మాత్రం తాళం చేతులు లేనందును ప్రత్యామ్నాయంగా తాళాలను పగలగొట్టేందుకు విముఖత వ్యక్తం చేశారు. దీంతో మద్యాహ్నం వరకూ ప్రయత్నాలు చేసిన జిల్లా యంత్రాంగం నూకపల్లి కాలేజీలోని స్ట్రాంగ్ నుండి వెనుదిరిగారు. తాళాలు ఓపెన్ కావడం లేదన్న విషయం హై కోర్టు దృష్టికి తీసుకెల్తామని జిల్లా కలెక్టర్ యాస్మిన్ వివరించారు. అయితే తాళాలు ఓపెన్ కాకపోవడం కాదని, తాళం చేతులే మిస్సయ్యాయని స్ట్రాంగ్ రూంకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన పిటిషన్ ను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని ఎన్నికల సంఘాన్ని ఈ నెల 12 ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను ఏప్రిల్ 26న తన ముందు ఉంచాలని స్పష్టం చేసింది.