Dharmapuri: ధర్మపురిలో ఉత్కంఠ.. కోర్టు అదేశాలతో తెరవనున్న స్ట్రాంగ్ రూం..
Dharmapuri: ఇవాళ ఉ.10 గంటలకు ఈవీఎంల స్ట్రాంగ్‌రూమ్‌ను తెరవనున్న అధికారులు
Dharmapuri: ధర్మపురిలో ఉత్కంఠ.. కోర్టు అదేశాలతో తెరవనున్న స్ట్రాంగ్ రూం..
Dharmapuri: హైకోర్టు ఆదేశాలతో ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను ఇవాళ ఉదయం 10 గంటలకు అధికారులు తెరవనున్నారు. 2018 నాటి ఎన్నికల ఫలితాల ప్రకటనలో అవకతవకలు జరిగాయని...కొప్పుల ఈశ్వర్ ఎన్నిక అక్రమమని.. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈవీఎంలను జగిత్యాల వీఆర్‌కే ఇంజినీరింగ్ కాలేజీలో భద్రపరిచి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. అప్పటి రిటర్నింగ్ అధికారి ఉద్యోగ విరమణ చెందడంతో న్యాయస్థానానికి హాజరు కాకపోగా వారెంట్ జారీచేసి గత నెల 21లోగా హాజరుపర్చాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంను తెరిచి... అప్పటి ఎన్నికకు సంబంధించిన 17ఏ, 17 సీ డాక్యుమెంట్ కాపీలను, కౌంటింగ్ సీసీ ఫుటేజీ, ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను ఈనెల 11న సమర్పించాలని ఆ సమయంలో ఉన్న రిటర్నింగ్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి.. న్యాయస్థానంలో హాజరై వివరణ ఇచ్చారు. ఈనెల 11లోగా వివరాలు సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన జగిత్యాలకు వచ్చి జిల్లా కలెక్టర్‌కు వివరాలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సమక్షంలో స్ట్రాంగ్‌రూం తెరిచి ఎన్నికలకు సంబంధించిన వివరాలను రిటర్నింగ్ అధికారికి అప్పగించనున్నారు.