Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై డీజీపీ సమీక్ష
Hyderabad: మూడు కమీషనరేట్ల సీపీలతో పాటు ఐబీ చీఫ్‌తో సమావేశం
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై డీజీపీ సమీక్ష
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవిగుప్తా సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనర్లతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌లతో రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజల సౌకర్యార్థం GHMC పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి సమర్థవంతమైన చర్యలు ఏంటని.. పోలీస్ అధికారుల నుంచి సూచనలు తీసుకున్నారు.
విజిబుల్ పోలీసింగ్‌ను అమలు చేయడం... ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ అందించడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త స్కైవాక్‌లు, ఫ్లైఓవర్‌ల చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను డీజీపీకి వివరించారు. మూసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వివరించిన డీజీపీ, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలు వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.