Basara: బాసర పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన భక్తులు, అమ్మవారిని దర్శంచుకోవడానికి క్యూకట్టిన భక్తులు

Update: 2023-06-08 10:16 GMT

Basara: బాసర పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

Basara: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అర్చకులు శ్రీమహాకాళి, మహాలక్ష్మి ,సరస్వతి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం,అర్చన విశేష పూజలను ఘనంగా నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరినదిలో భక్తులు పుణ్యస్నా నాలు ఆచరించి అమ్మవారి దర్శించుకున్నారు. పంచమి శుభదినం కావడం అదేవిధంగా స్కూళ్లు ప్రారంభం కావటానికి కొద్దిరోజులే సమయం ఉండటంతో భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. అమ్మవారి సన్ని‌ధిలోని వెయ్యి‌ రూపాయల అక్షరాభ్యా‌స మండపం భక్తులతో నిండిపోయింది.

Tags:    

Similar News