Devineni Avinash: ఐటీ సోదాల వెనుక టీడీపీ కుట్ర ఉందని చాలామంది భావిస్తున్నారు..
Devineni Avinash: వంశీరామ్ బిల్డర్స్‌కు 2018లో హైదరాబాదులోని తమ భూమిని డెవలప్‌మెంటుకు ఇచ్చామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్.
Devineni Avinash: ఐటీ సోదాల వెనుక టీడీపీ కుట్ర ఉందని చాలామంది భావిస్తున్నారు..
Devineni Avinash: వంశీరామ్ బిల్డర్స్‌కు 2018లో హైదరాబాదులోని తమ భూమిని డెవలప్‌మెంటుకు ఇచ్చామన్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. తన దగ్గర నుంచి ఐటీ అధికారులు ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ల లేదన్నారాయన... తన వద్ద ఉన్న డాక్యుమెంట్లను వెరిఫై చేశారని చెప్పారు. తనకు ఎలాంటి లిటిగెంట్ భూములతో సంబంధం లేదన్నారు. వంశీరామ్ బిల్డర్స్‌కు లిటిగెంట్ భూములతో సంబంధం ఉందని తాను అనుకోవడం లేదన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని వెల్లడించారు అవినాష్.. తమ ఇంట్లో ఐటీ సోదాల వెనుక టీడీపీ కుట్ర ఉందని చాలామంది భావిస్తున్నారని చెప్పారాయన.... ప్రజాబలం లేని వాళ్లే ఇలాంటి కుట్రలు చేస్తారని ఆరోపించారు. చంద్రబాబుకు వ్యవస్థలను మేనేజ్ చేయటమే తెలుసన్నారు వైసీపీ నేత అవినాష్.