Devarakadra Railway Over Bridge: నత్తనడకన దేవరకద్ర రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు

Devarakadra Railway Over Bridge: *రెండేళ్లు గడుస్తున్నా పనుల్లో కన్పించని వేగం *నిత్యం ఈ రోడ్డుపై వేలాది వాహనాల రాకపోకలు

Update: 2021-10-03 03:33 GMT

నత్తనడకన దేవరకద్ర రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు

Devarakadra Railway Over Bridge: మహబూబ్‌నగర్- రాయచూరు 167వ జాతీయ రహదారిపై దేవరకద్ర వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జి పనులు మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. నిత్యం ఈ రహదారిపై మహబూబ్‌నగర్, హైదరాబాద్, రాయచూర్, నారాయణపేట, మఖ్తల్, ఆత్మకూరు వైపు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

దేవరకద్ర వద్ద రైల్వే గేట్ పడే సమయంలో గంటల తరబడి వాహనదారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఆర్వోబీ నిర్మాణ డిమాండ్ అనేక ఏళ్ల నుంచి ఉంది. 24 కోట్ల రూపాయలతో 2019లో అనుమతులు ఇవ్వగా.. పనులు ప్రారంభించారు. రెండేళ్లు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనకడన సాగుతున్నాయి.

ప్లై ఓవర్‌ పక్కనున్న సర్వీస్‌ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రోడ్‌లో ప్రయాణం నరకప్రయంగా మారిందంటున్నారు వాహనదారులు. వర్షాకాలంలో సర్కాస్‌ ఫీట్‌లు తప్పడం లేదు. ఇక ఎండాకాలంలో విపరీతమైన దుమ్ముతో వాహనదారులు, పాదచారులు, షాపు యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటున్నారు. ఇప్పటికీ 50 శాతం పనులు కూడా పూర్తికాలేదంటున్నారు.

కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్లే పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతలు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే విషయంపై గతంలో నిరసనలు కూడా చేపట్టారు. ఇప్పటికైనా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలంటున్నారు.

Tags:    

Similar News