Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ధరలు ఆకాశానికి.. రంజాన్ సందర్భంగా పెరిగిన అమ్మకాలు
Dry Fruits: ఇఫ్తార్ విందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వినియోగం
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ధరలు ఆకాశానికి.. రంజాన్ సందర్భంగా పెరిగిన అమ్మకాలు
Dry Fruits: రంజాన్ పండగ సీజన్ తో భాగ్యనగరానికి కొత్త కల వచ్చింది. సాయంత్రమైతే హలీం సెటర్ల దగ్గర డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల దగ్గర హడావుడి మొదలవుతుంది. ఉపవాస దీక్షముగిసిన తరువాత ముస్లింలు ఇప్తార్ విందులో రకరకాల వంటకాలు ఆహారంగా తీసుకుంటారు. వీటిలో తప్పని సరిగా డ్రై ఫ్రూట్స్ వాడతారు.
రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్ష తరువాత, ఇఫ్తార్ విందులో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటారు. బాదం జీడిపప్పు, పిస్తా, కిస్మిస్, ఖర్జూరం, వాల్ నట్స్ ఎక్కువగా తీసుకుంటారు.దీంతో వీటికి డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా శుక్రవారం రోజు ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు తీపి వంటకాలు చేసుకుంటారు. ముఖ్యంగా, బాదం పిర్నీ,ఖుర్బానీ మీటా, ప్రూట్స్ సలాడ్, డబుల్ కా మీటా ,ఇలా రక రకాల స్వీట్స్ తయారు చేసుకుంటారు. ఇలా అన్నింటిలో డ్రై ఫ్రూట్స్ తప్పనిసరిగా వాడుతారు.
డ్రై ఫ్రూట్స్ లో బాదం, పిస్తా ,కాజు,కిస్మిస్, ఖర్జూరాకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ముస్లిం లే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ వాడుతున్నారు.,ఉష్ణోగ్రతల పెరుగుదల కారణం గా అమ్మకాలు దాదాపుగా మధ్యాహ్నం వేళల్లో సాగడం లేదని, ఎక్కువగా సాయంకాలం వేళల్లో, అధికంగా అమ్మకాలు సాగుతుందని వ్యాపారులు తెలిపారు.
సాధారణ రోజుల్లో హైదరాబాద్ మొత్తం మీద రోజుకు 3-4 టన్నుల డ్రై ఫ్రూట్ అమ్మకాలు జరిగితే, రంజాన్ మాసం లో మాత్రం 10 నుంచి 12 టన్నుల డ్రై ఫ్రూట్స్ అమ్మకాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.