Delhi Excise Policy Case: ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ
Delhi Excise Policy Case: ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కాసేపట్లో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ ముగియనుండడంతో ఆమెను కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్‌ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో కవితతో సహా నలుగురు నిందితులు కోర్టులో హాజరుకావాలంటూ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 26 నుండి కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.