Hyderabad: మియాపూర్‌లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం.. 20వ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్య
Hyderabad: SMR వినయ్ ఫౌంటేన్ హెడ్ అపార్ట్మెంట్‌లో ఘటన
Hyderabad: మియాపూర్‌లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
Hyderabad: హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో డిగ్రీ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. మియాపూర్ SMR వినయ్ ఫౌంటేన్ హెడ్ అపార్ట్మెంట్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని కోమలిక ఆత్మహత్య చేసుకుంది. 20 అంతస్తుల భవనంనుంచి దూకి అఘాయిత్యానికి పాల్పడింది. డిగ్రీ చదువుతూ టెక్ మహేంద్ర లో కోర్స్ చేస్తున్నట్లు సమాచారం. అపార్ట్ మెంట్‌నుంచి దూకిన యువతి తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు.