దానం నాగేందర్ ఇంట్లో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ... ఏం జరుగుతోంది?

Defected BRS MLAs: దానం నాగేందర్ నివాసంలో పార్టీ ఫిరాయించి 10 మంది ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమయ్యారు.

Update: 2025-02-05 07:22 GMT

ఏం చేద్దాం: దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలు

BRS Defected MLAs: దానం నాగేందర్ నివాసంలో పార్టీ ఫిరాయించి 10 మంది ఎమ్మెల్యేలు బుధవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ ఫిబ్రవరి 4న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఏం చేయాలనే దానిపై ఎమ్మెల్యేలు చర్చిస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీతో పాటు సుప్రీంకోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వాలనే దానిపై ఎమ్మెల్యేలు తర్జన భర్జనలు చేస్తున్నారు. 2024 మార్చి నుంచి మే మధ్య కాలంలోదానం నాగేందర్, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది.తగిన సమయంలోపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 2025 జనవరిలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. ఈ పిటిషన్లను కలిపి విచారణ చేయనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. వారం రోజుల క్రితమే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 4న తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులిచ్చారు.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురౌతారని బీఆర్ఎస్ ధీమాగా చెబుతోంది.

Tags:    

Similar News