Hyderabad: బిర్యానీలో బ‌ల్లి.. నిల‌దీసిన క‌స్ట‌మ‌ర్‌కు య‌జ‌మాని స‌మాధానం ఏంటంటే

రోజురోజుకీ క‌ల్తీ పెరిగిపోతోంది. ఎలాగైనా స‌రే డ‌బ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు.

Update: 2025-05-16 12:46 GMT

Hyderabad: బిర్యానీలో బ‌ల్లి.. నిల‌దీసిన క‌స్ట‌మ‌ర్‌కు య‌జ‌మాని స‌మాధానం ఏంటంటే

Hyderabad: రోజురోజుకీ క‌ల్తీ పెరిగిపోతోంది. ఎలాగైనా స‌రే డ‌బ్బులు సంపాదించాలని అనుకుంటున్నారు. శుభ్ర‌త‌ను గాలికి వ‌దిలేస్తున్నారు. ఇటీవ‌ల ప‌లు రెస్టారెంట్స్‌లో వెలుగు చూసిన సంఘ‌ట‌న‌లు బ‌య‌ట ఫుడ్ తినాలంటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితిని తీసుకొచ్చాయి. తాజాగా ఇలాంటి ఓ భ‌యాన‌క సంఘ‌ట‌న రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.మే 15వ తేదీ మధ్యాహ్నం సమయంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడకు చెందిన గుజ్జా కృష్ణారెడ్డి అనే వ్యక్తి సాగర్ రహదారిలో ఉన్న మెహఫిల్ రెస్టారెంట్‌కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేశాడు.

ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ బిర్యానీని తినడం ప్రారంభించిన కృష్ణారెడ్డి, చివరి వరకు తిన్న అనంతరం తన ప్లేటులో ఓ వింత వస్తువు కనిపించడం గమనించాడు. పరిశీలించి చూసే సరికి అది చచ్చిపోయిన బల్లిగా తేలింది. శరీరమంతా జలదరించిన కృష్ణారెడ్డి, వెంటనే హోటల్ యజమానిని ప్రశ్నించగా.. అత‌ను స్పందన మరింత ఆశ్చర్యానికి గురిచేసింది.

"బల్లి ఫ్రై అయ్యింది.. బాగుంటుంది.. తినేయి" అంటూ యజమాని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, "ఏం చేయగలవు చెయ్యి.. మమ్మల్ని ప్రశ్నిస్తావా?" అంటూ దురుసుగా మాట్లాడినట్టు సమాచారం. ఈ పరిణామాలతో కృష్ణారెడ్డి వెంటనే డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు హోటల్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. బాధితుడి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వచ్చేసరికి రెస్టారెంట్ యజమాని ప్రదేశం నుంచి పారిపోయాడు. తన హోటల్‌కు తాళం వేసి పరారైనట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News