Hyderabad: ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన.. జూబ్లిహిల్స్‌లో దళిత యువతిపై అత్యాచారం

Hyderabad: ఐపీసీ 324,354, 376,506, 509 R/w 109 సెక్షన్ల కింద కేసులు నమోదు

Update: 2023-10-20 13:55 GMT

Hyderabad: ఆలస్యంగా వెలుగులోకి దారుణ ఘటన.. జూబ్లిహిల్స్‌లో దళిత యువతిపై అత్యాచారం

Hyderabad: అతడో స్కూల్ అకాడమిక్ ఛైర్మన్.. విద్యాబుద్ధులు చేప్పే స్థానంలో ఉండి... తనలో ఉన్న మృగాన్ని చూపించాడు. అవకాశం కోసం.. ఎదురుచూసి.. అదునుదొరకగానే.. యువతిపై అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెప్తే... చంపేస్తానంటూ బెదిరించాడు. మూడు నెలల తర్వాత తల్లి ఆరా తీయగా విషయం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇంట్లో పనిచేసే దళిత యువతిపై అత్యాచారం, దాడి చేసి చేసిన ఘటనలో ఛైర్మన్ మురళీ ముకుంద్‌తో పాటు అతని కుమారుడు ఆకాష్‌పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు..

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 మిథులానగర్‌లో నివాసం ఉన్న జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ అకాడమిక్‌ చైర్మన్‌ మురళీ ముకుంద్‌ ఇంట్లో ఓ యువతి పని మనిషిగా చేస్తోంది. పనిలో చేరినప్పటి నుంచి ఆ యువతిపై కన్నేశాడు మురళీ ముకుంద్. ఈ ఏడాది జూలై 16న యువతిని బెడ్‌షీట్‌ మడత పెట్టాలని చెప్పి తన బెడ్రూంకు పిలిచాడు మురళీ ముకుంద్. . అనంతరం ఆమెతో పాటు బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టాడు. ఆ తర్వాత స్నానంచేసి రావాలని బలవంత పెట్టాడు. బెదిరింపులకు పాల్పడంతో భయపడిన యువతి..

అతను చెప్పినట్లు చేసింది. స్నానం చేస్తుండగా.. ఫొటోలు, వీడియో తీశానని వాటిని బయటపెడతానని ముకుంద్ బెదిరించాడు. ఈ క్రమంలో ఆమైపె అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగిన విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు నీ తల్లిని కూడా చంపేస్తానని మురళీ ముకుంద్‌ బెదిరించాడు.

జూలై 17న బాధితురాలు ఈ విషయాన్ని మురళీముకుంద్‌ కుమారుడు ఆకాష్‌కు చెప్పింది. అయితే తన తండ్రి చేసిన అకృత్యానికి అతడూ వంత పాడాడు. ఈ విషయం బయటకు చెప్పకూడదంటూ బాధితారులిని తీవ్రంగా కొట్టాడు. చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత రెండ్రోజులకు అంటే జూలై 20 బంజారాహిల్స్‌ పీఎస్‌లో బాధితురాలు సిమ్ కార్డు దొంగలించిదంటూ తప్పుడు ఫిర్యాదు చేసింది మురళీ ముకుంద్‌ కుటుంబం. కానీ బాధితురాలి తల్లికి మాత్రం... డబ్బులు, బంగారం దొంగలించిందంటూ..

ఫోన్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు రప్పించారు. సిమ్‌కార్డు చోరీ కేసుతో భయపడిన బాధితురాలు.. అత్యాచారం, దాడి విషయాన్ని పోలీసులకు చెప్పేందుకు భయపడింది. మరోవైపు అత్యాచార ఘటన చెప్పకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబానికి లక్షా 70 వేల రూపాయలు ఇచ్చారు ముకుంద్. ఈ డబ్బుతో బాధితురాలి నోరు మూయించేందుకు ప్రయత్నించింది మురళీ ముకుంద్‌ కుటుంబం. అంతేకాకుండా... సిమ్‌ దొంగలించినట్లు ఫోన్‌లో బాధితురాలి వాయిస్‌ రికార్డు చేసుకుంది.

సిమ్‌ కార్డు చోరీ కేసుతో భయపడిపోయిన బాధితురాలు ఇంటికే పరిమితమైంది. ఆమె భయాందోళనకు గురకావడం, ఇంటికే పరిమితం కావడంతో తల్లి ఆరా తీసింది. దీంతో..... అసలు విషయం చెప్పింది బాధితురాలు. మురళీ ముకుంద్‌ వికృత రూపాన్ని బయటపెట్టింది. అతని కుమారుడు ఆకాష్‌ ప్రవర్తించిన తీరును వివరించింది. దీంతో తన కూతురుతో కలిసి ఈ నెల 18న బంజారాహిల్స్‌ పోలీసులకు మురళీముకుంద్‌పై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. మురళీముంకుంద్‌ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 324,354, 376,506. 509 R/w 109 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి... . తండ్రికొడుకులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. 

Tags:    

Similar News