D Srinivas: నిన్న చేరిక.. ఇవాళ రాజీనామా..

D Srinivas: కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. డి.శ్రీనివాస్‌ రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు.

Update: 2023-03-27 11:30 GMT

D Srinivas: నిన్న చేరిక.. ఇవాళ రాజీనామా..

D Srinivas: కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. డి.శ్రీనివాస్‌ రాజీనామా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. నిన్న గాంధీభవన్‌లో ఠాక్రే సమక్షంలో పార్టీలో చేరిన డీఎస్‌.. ఎవరూ ఊహించని విధంగా ఇవాళ రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాసిన డీఎస్‌.. తన కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరిక సందర్భంగానే..ఆశీస్సులు అందించడానికి గాంధీభవన్‌కు వెళ్లానని.. తనకు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్‌ వాదినేనని, ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్నారు. అనవసర రాజకీయ వివాదంలోకి తనను లాగకండి అంటూ లేఖలో పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే.. ఇదే తన రాజీనామా లేఖగా భావించాలన్నారు. తనకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదని అన్నారు డీఎస్.

Tags:    

Similar News