Cyberabad Police: ట్రాన్స్ జెండర్స్‌కోసం సైబారాబాద్ సీపీ వినూత్న ప్రయత్నం

Cyberabad Police: వారికి అండగా తామున్నమంటూ ధైర్యం నింపే ప్రయత్నం * చదువుకున్న వారికి మెరుగైన శిక్షణ

Update: 2021-03-10 09:48 GMT

ట్రాన్స్జెండర్ డెస్క్ ప్రారంభం (ఫైల్ ఫోటో)

Cyberabad Police: బ్రహ్మ దేవుడు పక్షపాతిగా మారి వారి తల రాతలు అలా రాశాడా తెలీయదు.. కానీ, వారి జీవితం అంతా అంధకారం. శూన్యం అనుకుంటూ బతుకు బండి సాగిస్తున్నారు. వారు నివసించేందుకు నివాసం దొరకడమే కష్టం.. ఒకవేళ దొరికినా డబుల్ రెంట్ పే చేయాల్సిందే. ఇక సమాజంలో సైతం వారిది చిన్నచూపే.. అలాంటి వారి కోసం ట్రాన్స్ జెండర్స్ ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు.

సాధారణంగా నగరంలోని సిగ్నల్స్, ప్రధాన కూడళ్ల వద్ద భిక్షాటన చేస్తూ దుర్భరమైన స్థితిలో ఉండే ట్రాన్స్ జెండర్లకు తామున్నామంటున్నారు సైబరాబాద్ పోలీసులు  సమాజంలో వారి పట్ల చిన్న చూపు చూస్తూ అంటరాని వారిగా భావిస్తుంటారు. అలాంటి వారి కోసమే మేమున్నామంటూ సైబరాబాద్ పోలీసులు భరోసాని కల్పిస్తున్నారు. వారి కోసం ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేసి వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు.

గత కొంతకాలంగా వీరి సమస్యపై స్టడీ చేసిన సైబరాబాద్ సెక్యూరిటీ సెల్, సైబరాబాద్ పోలీసులు, వీరికి ఓ ప్రత్యేకమైన డెస్క్ ఏర్పాటు చేయాలనే భావనకు వచ్చారు. ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీ డెస్క్ పేరుతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌‌లో ప్రారంభించారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స్ జెండర్స్‌కు ఉపాధి అవకాశాలు, లీగల్ అడ్వైజ్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ నిర్వహించిన ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

చరిత్రలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్ జెండర్ల కోసం సైబరాబాద్‌ కమీషనరేట్‌ పరిధిలో ప్రత్యేకమైన కమ్యూనిటీ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ డెస్క్ ద్వారా ట్రాన్స జెండర్స్‌లో చదువుకున్న వారు, ఇతర పనులపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నట్టు డీసీపీ అనసూయ తెలిపారు. వినూత్నమైన ప్రయోగం చేసి అందరూ దూరం పెట్టే ట్రాన్స్‌ జెండర్‌ కోసం సైబరాబాద్‌ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News