Komaram Bheem: తాతల ఆస్తుల కోసం ఇరువర్గాల మధ్య దాడులు.. ఇద్దరిని హత్య చేసిన ప్రత్యర్థులు
Kumuram Bheem: గాయపడ్డ వారిని ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలింపు
Komaram Bheem: తాతల ఆస్తుల కోసం ఇరువర్గాల మధ్య దాడులు.. ఇద్దరిని హత్య చేసిన ప్రత్యర్థులు
Komaram Bheem: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జుక్కులపల్లిలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్యకు గురయ్యారు. భూతగాదాలతో బక్కమ్మ, నర్సయ్యను హత్య చేయగా..నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యవసాయ పనులు చేస్తుండగా హత్యలు జరిగినట్టు సమాచారం. తాతల ఆస్తుల కోసం ఇరువర్గాలు దాడులు చేసుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డవారిని ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలించారు.