Corona Cases in Warangal: వరంగల్‌లో పంజా విసురుతున్న కరోనా

Corona Cases in Warangal: కరోనా సెకండ్ వేవ్ ముప్పు తగ్గుతుందనుకునేలోపే మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.

Update: 2021-08-09 15:00 GMT

Corona Cases in Warangal: వరంగల్‌లో పంజా విసురుతున్న కరోనా

Corona Cases in Warangal: కరోనా సెకండ్ వేవ్ ముప్పు తగ్గుతుందనుకునేలోపే మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో మరోసారి కరోనా కోరలు చాస్తోంది. వైరస్ భారిన పడి హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా ప్రభావంపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్.

కరోనా మరోసారి పంజా విసురుతోంది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ భారిన పడి హాస్పిటల్ లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు 2 వందల నుంచి 3 వందల వరకూ కరోనా బాధితులు ఎంజీఎంకు వచ్చేవారు. అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ కొత్త కేసుల నమోదులో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. మళ్లీ వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు, రాకపోకలు, ఫంక్షన్లు యదావిధిగా జరుగుతుండటంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని గీసుకొండలో వారంపాటు పాక్షిక లాక్‌డౌన్ విధించారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తి, కమలాపూర్‌ మండలాల్లో వైరస్‌ ఉధృతి తీవ్ర స్థాయిలో పెరుగుతోంది. ఎంజిఎం ఆసుపత్రిలో కొవిడ్ వార్డ్ మొదలుకొని ఆసుపత్రి మొత్తంలో చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో మరోసారి కరోనా విపత్తును ఎదుర్కొనే దుస్థితి వస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా వైరస్ మహమ్మారి పూర్తిగా అంతరించిపోలేదన్నది ప్రజలు గ్రహించాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆదమరిచి ఆగం కావొద్దని హెచ్చరిస్తున్నారు ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్. ఏదేమైనా ప్రతీ ఒక్కరూ నిర్లక్ష్యం వీడి తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయాలి. 

Tags:    

Similar News