Akhil Pailwan: రాంనగర్ అఖిల్ పహిల్వాన్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు

Akhil Pailwan: పరారీలో ఉన్న ఏడుగురిలో వెస్ట్ బెంగాల్ ఆర్గనైజర్ కూడా ఉన్నారన్న పీపీ

Update: 2024-02-01 09:12 GMT

Akhil Pailwan: రాంనగర్ అఖిల్ పహిల్వాన్‌కు బెయిల్ నిరాకరించిన కోర్టు

Akhil Pailwan: హైదరాబాద్ రాంనగర్ అఖిల్ పహిల్వాన్‌కు బెయిల్ కోర్టు నిరాకరించింది. వ్యభిచారం కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లిన క్రమంలో బెయిల్ నిరాకరించింది. కేసులో నిందితులు దొరకకుండా.. మిగతా వారికి బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందంటూ పీపీ వాదించారు. నిందితులు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని అన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్... మిగతా వారు దొరికేంత వరకు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టును పీపీ కోరారు. పరారీలో ఉన్న ఏడుగురిలో వెస్ట్ బెంగాల్ ఆర్గనైజర్ కూడా ఉన్నారని కోర్టుకు నివేదించారు పీపీ.

Tags:    

Similar News