తెలంగాణలో కొత్తగా 47 కేసులు
తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
తెలంగాణలో గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 41 కేసులు నమోదు కాగా, ఈ రోజు 47 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 40 కేసులు GHMC పరిధిలోనివి. దినికి సంబంధించిన హెల్త్ బులిటెన్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1414కి చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 428 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు కరోనాతో పోరాడి 952 మంది డిశ్చార్జ్ అయ్యారు. అందులో ఇవాళ ఒక్కరోజే 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో కరోనాతో పోరాడి ఇప్పటివరకు 34 మంది చనిపోయారు. అటు కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం మే29 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే!